![]() |
![]() |
.webp)
కుక్కు విత్ జాతి రత్నాలు షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోలో ఈ వారం ఒక్కో జాతి రత్నం వేసుకొచ్చిన గెటప్స్ మాములుగా లేవు. "ఏ సినిమాకైనా ప్రతినాయకుడు ఎంత పవర్ ఫుల్ గా ఉంటే నాయకుడు అంత పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. భయపెట్టే విల్లన్స్ నవ్విస్తే ఎలా ఉంటుందో మేము చూపించబోతున్నాం. " అంటూ ఈ వారం విలన్స్ స్పెషల్ థీమ్ అంటూ అనౌన్స్ చేసాడు. ఇక నిఖిల్ విజయేంద్ర సింహ వచ్చి జడ్జ్ అరుణను ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. "ఏ వదులు ఈరోజు నేను డాన్." అన్నారు. "ఈరోజు గోంగూర పీతలు మిక్సీలో కొట్టి దాన్ని పేస్ట్ చేసి దాన్ని ఇక్కడ వేస్తె ఉంటది జంపర్ మే బంపర్ " అన్నాడు ఫుల్ జోష్ తో. వెంటనే ప్రదీప్ వచ్చి "మా వాళ్ళు మార్కులు తక్కువ వేసి నిన్ను కుక్ ఆఫ్ లో వేసి " అంటూ సెటైర్ వేసాడు. "జడ్జెస్ ఈ క్యూట్ క్యూట్ ఫేస్ చూస్తుంటే అలా ఉందా " అన్నాడు.
ఐతే ఈ ఎపిసోడ్ మొత్తం "బాహుబలి" మూవీ గెటప్స్ తో వచ్చారు. రోహిణి కాలకేయ గెటప్ లో వచ్చింది. ఆమెను చూసి ప్రదీప్ గుర్తుపట్టలేదు. అందుకే ఇమ్మానుయేల్ అంటూ పిలిచాడు. దాంతో రోహిణి సీరియస్ ఐపోయింది. "నేనురా రోహిణిని ఇందా నాకిష్టం సున్నుండ" అంటూ హడావిడి చేసింది. హరి బిజ్జలదేవ గెటప్ లో వచ్చాడు. "వీడు నా కుక్కు " అంటూ శ్రవణ్ కి పక్కకు తోసేసాడు. "రాజ్యం మందిరం మొత్తం ఇక్కడే ఉన్నారే . దేవసేన అక్కడే ఉంది అంటూ జడ్జ్ అరుణను, బాహుబలి ఇక్కడ ఉన్నారు అంటూ ఆలీని, భల్లాలదేవుడు ఇక్కడే ఉన్నారు అంటూ సంజయ్ ని, ఆఖరికి కట్టప్ప కూడా ఉన్నాడిక్కడ అంటూ ప్రదీప్ ని చూపించాడు.
ఇక జడ్జి శ్రీదేవి ఐతే "ఏంటి హరి ఈరోజు కృతికను పట్టించుకోలేదు అని అడిగారు. "గెటప్ చూసి వద్దు అంటాడని " అన్నాడు బాధతో. తర్వాత ఇమ్మానుయేల్ వచ్చాడు. విక్రమార్కుడు మూవీలో బావూజీ గెటప్ లో వచ్చాడు. నా తమ్ముడు టిట్ల అంటూ రోహిణిని చూపించి టిట్ల కాదా అన్నాడు. "కాలకేయ " అంది రోహిణి. "కాళ్లకు వెయ్య అంటే తలకు ఒక వంద ఉంటదా" అంటూ పంచ్ వేసాడు. తర్వాత దీక్ష పంత్ సాహస వీరుడు సాగర కన్య మూవీలో మలక్పేట మాంచాల గెటప్ లో వచ్చింది. ఈ గెటప్స్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఉన్నారు.
![]() |
![]() |